టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. తన ఇన్ స్ట్రాగ్రామ్ ఫాలోవర్ల కోసం సోమవారం ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ (Ask Me Anything) నిర్వహించింది. ఏది పడితే అది అడగొద్దు..నేను సమాధానం ఇవ్వగలిగేలా ఉండే మంచి ప్రశ్నలు అడగండి..అంటూ సెషన్ ను షురూ చేసింది సామ్. పనులు చేసేందుకు మీకు ‘ఇంత ధైర్యం’ ఎక్కడి నుంచి వస్తుంది అని ఓ యూజర్ సామ్‌ను అడిగాడు. పెద్ద కష్టాలు, సమస్యలను ఎదుర్కొంటే గొప్ప ధైర్యం వస్తుంది..అంటూ సమాధానమిచ్చింది.
అయితే మరో నెటిజన్ మాత్రం కాస్త కోపం తెప్పించే ప్రశ్నే వేశాడు. నేను మిమ్మల్ని పునరుత్పత్తి (reproduce) చేయాలనుకుంటున్నాను..మీరు పునరుత్పత్తి చేశారా..? అంటూ అడగకూడని ప్రశ్న అడిగాడు. దీనికి సామ్ ఓ వాక్యంలో పునరుత్పత్తి అనే పదాన్ని ఎలా వాడతారు..దాన్ని ముందుగా గూగుల్ చేసి ఉండాలి అంటూ ఫైర్ అవుతూ రిప్లై ఇచ్చింది.
‘యంగ్ జనరేషన్’ కోసం ఓ సలహా ఇవ్వాలని మరో నెటిజన్ కోరగా..విరామం తీసుకోండి..కాలిపోవద్దు..అంటూ తనదైన స్టైల్లో రిప్టై ఇచ్చింది. మీరు భవిష్యత్తులో సినిమాకు దర్శకత్వం వహిస్తారా..? మరో యూజర్ అడిగినపుడు ఎప్పుడూ చెప్పకూడదని నేను ఈ మధ్యనే నేర్చుకున్నానంది. అదేవిధంగా తన ‘జీవితంలో అంతిమ లక్ష్యం’ గురించి బదులిస్తూ ‘గుర్తుంచుకోవాలి’ అని జవాబిచ్చింది సమంత.