Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత అక్కినేని నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుది. కొన్ని రోజులు ఇద్దరు బాగానే ఉన్నారు. కాని ఏవో మనస్పర్ధల వలన వారు విడిపోవల్సి వచ్చింది. సమంత నుండి విడిపోయాక చైతూ శోభితని వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్‌గా ఉంది. రాజ్ నిడమోరుతో డేటింగ్లో ఉందనే ప్రచారం నడుస్తుంది. అయితే సమంత గత జ్ఞాపకాలని ఒక్కొక్కటిగా చెరిపేస్తూ ముందుకు సాగుతుంది. అప్పట్లో పెళ్లి చీరని తనకి అనుకూలంగా మార్చేసిన సమంత ఇప్పుడు డైమండ్ రింగ్ కూడా మార్చేసినట్టు చెబుతున్నారు.
విడాకుల అనంతరం సమంత చేతికి ఉన్న మూడు క్యారెట్ల డైమండ్ రింగ్ ఇటీవల కనిపించడం లేదు. ఏమై ఉంటుందా అని అందరు ఆలోచనలు చేస్తున్నారు. అయితే సమంత ఆ రింగ్‌ని మెడలో నెక్లెస్‌లా మార్చుకోవడం చర్చనీయాంశం అయింది. విడాకుల తర్వాత ఎంగేజ్మెంట్ రింగులను రీడిజైన్ చేసుకోవడం నేటితరం ఎక్కువగా చేసక్తున్నారు. ఈ క్రమంలో సమంత కూడా తన ఫ్యాషన్ ఎంపికల ద్వారా మనోభావాలని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. 2024లో, తన తెలుపు రంగు వెడ్డింగ్ గౌన్‌ను బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌గా మార్చుకున్న విషయం మనందరికి తెలిసిందే.
అప్పుడు దానిని నెటిజన్స్ రివెంజ్ డ్రెస్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రింగ్‌ని కూడా మార్చేసి చైన్‌లా చేసింది. అయితే గతాన్ని చెరిపేసే ప్రయత్నం సమంత చేస్తున్నా ఆమె జీవితంలోని కొన్ని గుర్తుగా మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్యకు అంకితం చేసిన టాటూ ఇప్పటికీ ఆమె శరీరంపై అలానే ఉండిపోయింది. నాగ చైతన్య, సమంత ఒకే మాదిరి టాటూ తమ చేతిపైన వేయించుకోగా, అది ఇప్పటికీ అలానే ఉంది. అది పోగొట్టుకోవడం కష్టం అని భావించి అలా ఉంచుకున్నారా, లేకుంటే గుర్తుగా అలా ఉంచుకున్నారా అనేది వారికే తెలియాలి అని కొందరు కామెంట్ చేస్తున్నారు.