House of the Dragon | ఓటీటీలలో హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని పేరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones – GOT). 8 సీజన్లుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా గాట్ మేకర్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ (House of the Dragon) సీజన్ 1 తెరకెక్కించారు. 2022లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దుమ్ములేపింది. ఇక ఇదే సిరీస్‌కు సంబంధించి తాజాగా సీజన్ 2 విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. కింగ్ విసెరీస్ టార్గారియన్ మరణం తరువాత అతని భార్య అలిస్సా తన కుమారుడు ఏగాన్ టార్గారియన్(Aegon Targaryain)ను కొత్త రాజుగా ప్రకటిస్తుంది, మరోవైపు విసెరీస్ కుమార్తె రెనెరియా టార్గారియన్ తనను తాను రాణిగా ప్రకటించుకుంది. అయితే రెండో సీజన్లో ఐరన్ థోర్న్ కోసం (సింహాసనం) ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరుగనున్నట్లు అర్థమవుతుంది. ఈ సీజన్లో ఐరన్ థోర్న్ ని దక్కించుకునేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సిరీస్‌కు అలాన్ టేలర్ (Alan Taylor) దర్శకత్వం వహిస్తుండగా.. మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డి’ఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌసైంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్-కార్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 16 నుంచి ప్రపంచవ్యాప్తంగా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా.. ఇండియాలో జియో సినిమా (Jio Cinema) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
The war has begun. Catch the first episode of House of the Dragon S2 NOW!
HOTD S2 now streaming exclusively on JioCinema Premium. New episode, every Monday at 6:30 AM, along with the U.S.
Available in English, Hindi, Tamil, Telugu, Kannada, Bengali and Marathi.
Subscribe to… pic.twitter.com/nsUBcDvl5d
— JioCinema (@JioCinema) June 17, 2024