Hansika Motwani | చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, పదహారేళ్ళకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాదిన అగ్ర కథానాయికగా వెలుగొందింది హన్సిక మోత్వానీ (Hansika Motwani ). ‘దేశముదురు’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.. గతేడాది డిసెంబర్లో ఆమె ప్రియుడు సోహైల్ కథూరియా (Sohael Khaturiya)ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇదే సమయంలో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇక హన్సిక మోత్వానీ నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ఎంవై3 (MY3). మూగెన్ రావు (Mugen Rao) హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను వదిలింది.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. హన్సిక ఇందులో ఎంవై3 అనే హ్యూమనాయిడ్ (Humanoid robot) రోబోగా.. అలాగే హ్యూమన్ పాత్రలో డ్యూయల్ రోల్లో నటిస్తుంది. తమిళ నటుడు శాంతును (Shantunu) సైంటిస్ట్‌గా నటిస్తున్నాడు. ఒక రోబోకి మనిషికి ప్రేమ ఎలా పుట్టింది. అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఇక ఈ వెబ్ సిరీస్‌కు రాజేష్ (M Rajesh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్(Disney + Hotstar) వేదికగా సెప్టెంబర్ 15 నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Prepare for a kalakalapana kadhal kadhai!❤️🤖#MY3 Streaming from September 15 on #DisneyPlusHotstar#MY3OnHotstar @rajeshmdirector @Trendloud @kaiyavecha@themugenrao @ihansika @imKBRshanthnu
@jananihere @itsSanjaySubash @VidhyaSuku pic.twitter.com/RxJh3UTTz5— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) September 12, 2023
ఇక హన్సిక నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌తో పాటు ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ ‘మ్యాన్’ వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.