Akira Nandan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ సినీ అరంగేట్రం గురించి గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అఖిరా ఎప్పుడు వెండితెరపై కనిపిస్తాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, అఖిరాను హీరోగా పరిచయం చేసే బాధ్యతను టాలెంటెడ్ హీరో మరియు దర్శకుడు అడివి శేష్ తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకుముందు శేఖర్ కమ్ముల లాంఛ్ చేయబోతున్నట్లు వార్తలు రాగా.. తాజాగా అడివిశేష్ పేరు బయటకు వచ్చింది.
అడివి శేష్‌కి, అఖిరాకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటం. గతంలో అఖిరా సంగీతం అందించిన ‘రైటర్స్ బ్లాక్’ షార్ట్ ఫిలిం సమయంలోనూ శేష్ మద్దతుగా నిలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అడివి శేష్ కేవలం నటుడిగానే కాకుండా ‘క్షణం’, ‘మేజర్’, ‘గూఢచారి’ వంటి సినిమాలతో తనలోని రచయితను, దర్శకుడిని నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే అఖిరా కోసం శేష్ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇక మెగా వారసుడిని ఒక వైవిధ్యమైన కథతో లాంచ్ చేయాలని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారట.
ప్రస్తుతం అఖిరా విదేశాల్లో సినిమా రంగానికి సంబంధించిన మెళకువలను నేర్చుకుంటున్నాడు. అడివి శేష్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందా లేక ఆయన కేవలం కథను అందిస్తారా అన్న దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా, అడివి శేష్ వంటి క్రియేటివ్ మైండ్ అఖిరా డెబ్యూ వెనుక ఉందనే వార్త మెగా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. మరోవైపు అఖిరా ఎంట్రీపై వస్తున్న ఈ వార్తలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నప్పటికీ, మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మోస్ట్ అవైటెడ్ డెబ్యూపై స్పష్టత రావాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.