Honey Rose | నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి హనీ రోజ్ తన రాబోయే పాన్ ఇండియా సినిమా ‘రేచల్’ (Rachel) ట్రైలర్‌తో సినీ ప్రియులను ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. హనీ రోజ్ తాజాగా ఒక రివెంజ్ డ్రామాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో మాంసం (బీఫ్) కొట్టు నడుపుకునే రేచల్ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది సినిమా కథ. తాజాగా విడుదలైన ట్రైలర్లో హనీ రోజ్ మాస్ అవతార్‌లో కనిపిస్తుంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో సహా ఐదు భాషల్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమాకు ఆనందిని బాల దర్శకత్వం వహిస్తుండగా.. బాబు రాజ్, రోషన్ బషీర్, కళాభవన్ షాజోన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం రాహేలు అనే టైటిల్‌తో విడుదల కాబోతుంది.