
వాషింగ్టన్: హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డు నామినీ పీటర్ బాగ్దనోవిచ్ (82) ఇకలేరు. లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని బాగ్దనోవిచ్ కుమార్తె ఆంటోనియా బాగ్దనోవిచ్ మీడియాకు వెల్లడించారు. పీటర్ బాగ్దనోవిచ్ పాతతరం హాలీవుడ్, నవతరం హాలీవుడ్‌కు నడుమ వారధిలా తన సేవలందించారు. ది లాస్ట్ పిక్చర్ షో, పేపర్ మూన్ లాంటి చిత్రాలతో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు.
మాస్క్, డైసీ మిల్లర్ లాంటి సినిమాలు ఆయనను ప్రముఖ దర్శకుడిగా మార్చాయి. మ్యూజికల్ డ్రామా ఎట్ లాంగ్ లాస్ట్ డ్రైవ్ కూడా పీటర్ బాగ్దనోవిచ్కు మంచి పేరు తెచ్చింది. పీటర్ ముందుగా ఇల్లీగల్లీ యువర్స్ నటి లూయిస్ స్టాట్టెన్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత హాలీవుడ్ నిర్మాత పొల్లీ ప్లాట్‌ను వివాహమాడారు. కానీ ఈ రెండు వివాహ బంధాలు విడాకులతో ముగిశాయి. ఆ తర్వాత లాస్ట్ పిక్చర్ హీరోయిన్ సైబిల్ షెఫర్డ్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు.