Dr. Shiva Rajkumar | కన్నడ చక్రవర్తి, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్యాన్సర్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నాడు. గత కొన్ని నెలలుగా శివరాజ్ కుమార్ క్యాన్సర్తో పోరాడుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఆపరేషన్ ఆనంతరం శివరాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అతడి భార్య గీత శివరాజ్ కుమార్ జనవరి 1న వెల్లడించింది. ఇక క్యాన్సర్ నుంచి కోలుకున్న శివరాజ్ కుమార్ మార్చి నుంచి సినిమా షూటింగ్లను తిరిగి ప్రారంభించనున్నారు.
ఇప్పటికే మార్చి 03 నుంచి #SRK131″ అనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ చిత్రం అనంతరం రామ్ చరణ్ కథానాయకుడిగా రాబోతున్న #RC16″ సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. ఇది ఒక పాన్ఇండియా చిత్రంగా రూపొందుతోంది, బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తన అప్కమింగ్ సినిమాలకు సంబంధించి శివన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న కూడా కొంత అలసటగా ఉంది. కానీ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాను. డాక్టర్లు కూడా ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. మార్చి నాటికి నేను పూర్తిగా కోలుకుని, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తాను అని భరోసా ఇచ్చారంటూ శివరాజ్ కుమార్ చెప్పుకోచ్చాడు. ఇక రామ్ చరణ్ సినిమా గురించి శివన్న మాట్లాడుతూ.. మార్చి 5న హైదరాబాద్ వెళ్తున్నా. కొన్ని రోజుల పాటు రామ్చరణ్ సినిమా షూట్లో పాల్గొంటా. ఈ చిత్రంలో నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది అంటూ చెప్పుకోచ్చాడు.