‘హిట్ 3’తో భారీ విజయాన్ని అందుకున్నారు నాని. దసరా, సరిపోదా శనివారం సినిమాలతో వరుసగా రెండుసార్లు వందకోట్ల క్లబ్‌లోకి చేరిన నాని, ముచ్చటగా మూడోసారి ‘హిట్ 3’తో ఆ మార్క్‌ని చేరుకోనున్నారు. ఈ వేడిలోనే తన తదుపరి సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌ని కూడా మొదలుపెట్టేశారు నాని.
‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైనట్టు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. రమ్యకృష్ణ, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.