నేచురల్ స్టార్ నాని నటుడిగానే కాకుండా నిర్మాతగాను అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నాని హిట్ అనే సినిమాను నిర్మించగా, చిన్న సినిమాగా విడుదలై ఈ సినిమా పెద్ద హిట్నే అందుకుంది. ఈ చిత్రంతో శైలేష్ కొలను డైరెక్టర్గా పరిచయమయ్యాడు. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా.. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది .
ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ యంగ్ హీరో రాజ్ కుమార్ రావ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులోనే దర్శకత్వం వహించిన శైలేష్.. హిందీ సినిమాకి కూడా డైరెక్ట్ చేయబోతున్నారట. చిన్న చిన్న మార్పులు చేసి హిందీలో హిట్ చిత్రాన్ని తీయబోతున్నారట. తాజాగా చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. చిత్రంలో రాజ్ కుమార్ రావు సరసన సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించబోతోంది. ఇంతకుముందు ‘పాగ్లైట్’ అనే నెట్ఫ్లిక్స్ సీరీస్ లో కన్పించిన ఈ భామ “హిట్” సినిమా చూశానని, ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించడం సంతోషంగా ఉందని వెల్లడించింది.