Hit Remake Release date | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా సైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’. నాచ్యురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతుంది. కాగా ‘హిట్’ చిత్రం హీందిలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. రాజ్‌కుమార్ రావు, సన్యా మల్హోత్రా హీరో హీరోయిన్లుగా నటించారు. ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన సైలేష్ కొలను రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.
ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో రాజ్‌కుమార్ ఇంటెన్సీవ్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. నిజానికి ఈ చిత్రం గత నెల 20న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. విక్రమ్ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటించాడు. విక్రమ్ గ్లింప్స్‌ను జూన్ 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్ అధినేత భూషన్కుమార్తో కలిసి దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించాడు.
Unravelling the first mystery. Hitting the theatres on 15th July 2022!
HIT – The First Case#HITGlimpseOfVikram out on 14th June.@RajkummarRao @sanyamalhotra07 @KolanuSailesh #BhushanKumar @TSeries @DilRajuProdctns @SVC_official #KrishanKumar @kuldeeprathor9 @tuneintomanan pic.twitter.com/ZMpImPYEV6— T-Series (@TSeries) June 11, 2022