తెలుగులో విజయవంతమైన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘హిట్-ది ఫస్ట్‌కేస్’ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం హిందీ రీమేక్‌ను లాంఛనంగా ఆరంభించారు. రాజ్‌కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్, టి సిరీస్ పతాకాలపై దిల్‌రాజు, భూషణ్‌కుమార్, కుల్దీప్ రాథోర్ నిర్మిస్తున్నారు. ‘నగరంలో అమ్మాయిల అదృశ్యం వెనకున్న మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ కథ ఇది. థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని దర్శకుడు తెలిపారు.