టాలీవుడ్ ఫ్రాంచైజీల్లో ఒక్క ‘హిట్’ మినహా మిగతావన్నీ రెండు భాగాలుగా వచ్చినవే. ‘పుష్ప’ మూడో భాగానికి సన్నాహలు జరుగుతున్నాయి. అయితే.. ‘హిట్’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే మూడో భాగం విడుదలై విజయాన్ని అందుకుంది. త్వరలో నాలుగో భాగం కూడా రాబోతున్నది.తమిళ హీరో కార్తీ ఇందులో హీరోగా నటించనున్నారు.
ఇటీవల ఈ సినిమా గురించి శైలేష్ కొలను మాట్లాడుతూ ‘హిట్ ఫ్రాంచైజీని ఏడు భాగాలుగా ప్లాన్ చేశాం. ఇప్పటికి మూడు భాగాలు పూర్తయ్యాయి. త్వరలోనే నాలుగోభాగం కూడా మొదలుపెడతాం. కార్తీ హీరోగా నటిస్తారు. అయిదు, ఆరు, ఏడు భాగాల్లోనూ ప్రముఖ హీరోలే ఉంటారు. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ముఖ్యంగా ఏడో భాగం ‘అవెంజర్స్’ రేంజ్లో ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలోని హీరోలంతా ఏడో భాగంలో భాగమవుతారు. దాన్ని చాలా గ్రాండియర్‌గా ప్లాన్ చేశాం’ అని తెలిపారు.