HIT 4 | హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుంది. నాని నిర్మాణంలో ఈ చిత్రాలు రూపొందుతుండగా, ప్రతి సినిమా కూడా ఒకటిని మించి ఇంకోటి అనేలా ఉంది. హిట్1 లో విశ్వక్ సేన్ నటించగా, ఆ మూవీ చివరిలో హిట్ 2 హీరో అడివి శేష్ అని రివీల్ చేశారు. ఇక ‘హిట్ 2’ క్లైమాక్స్ తర్వాత సీన్లో ‘హిట్ 3’లో హీరోగా అర్జున్ సర్కార్ పాత్ర నేచురల్ స్టార్ నాని చేస్తున్నట్టు రివీల్ చేశారు. హిట్ 3 చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. మూవీ చూసిన వారందరు కూడా మూవీపై పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఇక ‘హిట్ 4’లో హీరోను ‘హిట్ 3’ ఎండింగ్లో చూపించడం విశేషం.
‘హిట్ 4’లో హీరో కార్తీ అని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. కార్తీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేయడంతో ఆ విషయం బయటకు వచ్చింది. మూవీ లీక్స్‌పై దర్శకుడు శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే హిట్ 3 రిలీజ్ సందర్భంగా హిట్ 4 హీరోని అఫీషియల్‌గా ప్రకటించారు. సీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ ఛార్జ్ తీసుకున్నారు. త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద రిపోర్ట్ చేయనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే… ‘హిట్ 4’లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు.
కార్తీ గతంలో చాలా సార్లు పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాజమౌళి తీసిన ‘విక్రమార్కుడు సినిమాని ‘ఖాకి పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా తెలుగులోనూ హిట్ అయ్యింది. త్వరలో విడుదల కానున్న ‘వా వాతియార్’లోనూ ఆయనది పోలీస్ రోల్. అందులో కామెడీ చేయనున్నారు. అయితే కార్తీకి తమిళంతో పాటు తెలుగులోను క్రేజ్ ఉంది. ఆయన చేస్తున్న హిట్ 4 చిత్రం తెలుగుతో పాటు తమిళంలో సందడి చేయనుంది.