Hit 3 | నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3 చిత్రం కాగా, ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నపుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోయింది.ముఖ్యంగా చివరి 40 నిమిషాలు అయితే నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రథమార్ధం అంతా స్క్రీన్ప్లే బేస్డ్గా సినిమా సాగగా, సెకండాఫ్ మొత్తం సినిమా స్ట్రయిట్ నేరేషన్. ఓ విధంగా 80లో చిరంజీవి నటించిన ‘కిరాతకుడు’ సినిమాను గుర్తు చేస్తుంది. మాస్ ప్రేక్షకులకు నిజంగా ఇది విజువల్ ఫీస్టే. అసలు అర్జున్ సర్కార్ కేరక్టర్ ఇంట్రో నుంచే ఆ పాత్రపై ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు శైలేష్ కొలను. శైలేష్ ‘హిట్’ మూడో భాగాన్ని జనం మెచ్చేలా తీసిన కూడా హింసపాళ్లు కూసింత ఎక్కువైంది అని చెప్పాలి. చివర్లో అడవి శేషు సడన్ ఎంట్రీ, ‘హిట్ 4’ అంటూ కార్తీ ఎంటర్ అవ్వగానే.. థియేటర్ దద్దరిల్లిపోయింది. అయితే హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడం విశేషం.
ఇక హిట్ 3 సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సంతోషంతో నాని డైరెక్టర్ శైలేష్ కొలనుకు రంగులు పూశాడు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. నాని అయితే ఫుల్ ఖుష్లో ఉన్నాడు. మరోవైపు శైలేష్ చివరిగా తీసిన సైంధవ్ ఫ్లాప్ కావడంతో డీలా పడ్డ దర్శకుడు ఇప్పుడు హిట్ తో మరింత జోష్లో ఉన్నట్టు కనిపిస్తుంది. త్వరలో నాగార్జునతో ఓ మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.