HIT 3 | ఈ మధ్య సినీ పరిశ్రమకి పైరసీ పెనుభూతంగా మారింది. సినిమా రిలీజ్ అయిందో లేదో మూవీ వెంటనే ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తుంది. నిర్మాతలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా పైరసీ భూతం నుండి తప్పించుకోలేకపోతున్నారు. పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా పైరసీకి గురవుతుండడం నిర్మాతలకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ వారం హిట్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బడా హిట్ సాధించింది. తొలి రోజు హిట్ 3కి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే హిట్ 3 మంచి టాక్ దక్కించుకోవడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
అదే సమయంలో పెద్ద షాక్ తగిలింది. హిట్ 3 థియేటర్లలోకి వచ్చి 24 గంటలైనా గడవక ముందే ఒరిజినల్ ఆడియోతో హెచ్ డీ ప్రింట్ ఆన్లైన్లో లీకైంది. దీంతో మూవీ టీంతో పాటు నాని ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుండడంతో ప్రభుత్వాలు పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై చిత్ర నిర్మాతలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక హిట్ 3 విషయానికి వస్తే ఈ మూవీ మే 1న థియేటర్స్‌లో విడుదలైంది. ఫస్టాఫ్‌లో ఇన్వెస్టిగేషన్‌పై ఫోకస్ చేసి.. సెకండాఫ్‌లో చాలా ఎట్రాక్షన్స్‌తో నింపాడు. చాలా కేమియోలు ఆడియెన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాయి.
ఎప్పటి మాదిరిగానే నాని తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఈ సినిమాని చిన్న పిల్లలు ఎందుకు చూడకడదు అని సినిమా ముందుకు చెప్పారో మూవీ చూశాక అర్ధమైంది. శైలేష్ కొలను దర్శకత్వంలో.. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. సినిమాలో నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. సినిమాలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. వయలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని వైల్డ్ మాస్ యాక్షన్ అదిరిపోయింది.