HIT 3 | ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాలలో నాని హిట్ 3 చిత్రం ఒకటి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మొదటి రోజు ఈ మూవీకి 43 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి . ఇక రెండు రోజుల్లోనే నాని సినిమాకు 62 కోట్లు దాటాయి. ఇక మూడో రోజు కూడా మంచి నంబర్ వస్తుందని అంతా అనుకున్నారు. ట్రేడ్ వర్గాల అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీకి మూడు రోజుల్లో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. శనివారం ఒక్క రోజే రూ.20 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళ్తోంది.
హిట్ 3 చిత్రానికి మూడు రోజుల్లో 82 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వాల్ పోస్టర్ టీం వదిలిన ఈ కలెక్షన్ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ లెక్కన ఆదివారం నాడు మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం లేదు. వీకెండ్లోనే ఈ చిత్రం వంద కోట్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్, అద్భుతమైన ఆక్యుపెన్సీతో ఈ సినిమా అంతటా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. . నార్త్ అమెరికాలో కూడా ‘హిట్ 3’ జోరు చూపిస్తోంది. ఇప్పటికే $1.8 మిలియన్లు వసూలు చేసిన ఈ చిత్రం, $2 మిలియన్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే దిశగా దూసుకెళ్తోంది.
ఈ సినిమా కోసం నానా ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. షూటింగ్ చేస్తుండగా నానికి గాయాలు అయ్యాయి. తలకి గాయం, మొహానికి ఫైర్ అంటుకోవడం , రక్తం కారిన, కుట్లు వేసినా, ఫైర్ అంటుకున్నా కూడా అవేమి లెక్క చేయకుండా షూటింగ్ చేశాడు. తాను పడిన కష్టానికి మంచి ప్రతిఫలం వస్తుండడంతో నాని కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చిత్రానికి మిక్కీ అద్భుతంగా బీజీఎం ఇచ్చాడని, ఏ సీన్‌కు ఎంత ఇవ్వాలి.. ఎక్కడ ఎంత కొట్టాలో అక్కడ అంతే కొట్టాడని, తనకు ఎలాంటి అవుట్ పుట్ అడిగానో అలాంటి అవుట్ పుట్ ఇచ్చాడని దర్శకుడు శైలేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ చిత్రం నాని కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది.