‘హిట్’ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌గా ప్రేక్షకుల్ని మెప్పించాయి. దీంతో మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’ నిర్మాణం నుంచే హైప్ క్రియేట్ చేస్తున్నది. నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయబోతున్నారు. రిలీజ్‌కు ఇంకా ముప్పైరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రచారపర్వాన్ని వేగవంతం చేశారు. మంగళవారం 30డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని తుపాకీ గురిపెట్టి ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. నాని పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుందని, నాని పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో సాగుతుందని మేకర్స్ తెలిపారు. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థలు: వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.