Karthik Indra Reddy Patlolla On Hindi Language Row | ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిందీ భాష వివాదం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీకి మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ ఇప్పుడు హిందీని అందరం నేర్చుకోవాలని ఢిల్లీ పెద్దల ముందు గులాంగా మారాడు. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హిందీ భాష గురించి మాట్లాడుతూ.. హిందీ ఇంపోజిషన్‌ను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఉర్దూ మిక్స్డ్ తెలుగు ఉండే తెలంగాణ లీడర్లు సైతం హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్దం కావడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి
పవన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కొంతమందికి ఎప్పుడు అర్థమవుతుంది?! హిందీని రుద్దడం కేవలం భాష గురించే కాదని. ఇది ఉత్తర(ఆర్యులు) భారతదేశంకి చెందిన వారు దక్షిణ (ద్రావిడ) భారతదేశంపై తమ ఆధిపత్యాన్ని చెలాయించడమే. వారు తాము ఉన్నతమైనవారమని, మనం తక్కువవారమని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు హిందీ/ఉర్దూ (రెండు ఒకటే) చాలా బాగా వచ్చు, మరి ఉత్తరాదిలో నివసించే ఎవరైనా తెలుగులో మాట్లాడతారా? వెన్నెముక లేనివారు మన గొంతులను వినిపిస్తే, దక్షిణాది గొంతు ఎప్పటికీ వినిపించదంటూ పవన్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
When will some imbeciles understand!!
Hindi imposition is not ‘JUST’ about language, it is about North (Aryan) dominance over South (Dravida).
They try to showcase that they are superior and we are inferior.
I know Hindi/Urdu (same) very well, will someone living in North… https://t.co/Zikpy760pU— Karthik Indra Reddy Patlolla (@KarthikIndrAnna) July 23, 2025