జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైలెస్సో’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రసన్నకుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వజ్ర వారాహి సినిమాస్ పతాకంపై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, మెహర్ రమేష్ కెమెరా స్విఛాన్ చేశారు. హీరో నిఖిల్ టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో మైథలాజికల్ టచ్‌తో సాగే చిత్రమిదని టైటిల్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతున్నది.
దేవతాశక్తి, త్యాగం, ఘర్షణలకు సంకేతంగా పోస్టర్ కనిపిస్తున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. నటాషాసింగ్, నక్ష శరణ్, అక్షరగౌడ, శివాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, దర్శకత్వం: ప్రసన్నకుమార్ కోట.