Manchu Manoj | మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనపై మోహన్‌బాబు దాడి చేయించారని ఏడీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి తన భార్య భూమా మౌనికతో వచ్చిన మంచు మనోజ్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ గేట్లు వేసేశారు.
గేట్లు వేయడంతో మంచు మనోజ్ దంపతులు చాలాసేపు అక్కడే కారులో ఉండిపోయారు. ఎంతసేపటికీ గేట్లు ఓపెన్ చేయకపోవడంతో కారు దిగి వెళ్లిన మనోజ్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తమ ఏడు నెలల పాప లోపలే ఉందని.. గేట్లు తీయాలని వారిపై మండిపడ్డారు. అయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తీసేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన మనోజ్. తన వెంట వచ్చిన ప్రైవేటు బౌన్సర్లతో గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లారు.
బౌన్సర్ల సాయంతో మనోజ్ లోపలికి వెళ్లడంతో అక్కడ ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు.. ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
High Tension at Manchu House in Jalpally.#ManchuManoj tried to enter the house, but denied by security over there.
గేటు బద్దలు కొట్టిన మనోజ్ & బౌన్సర్స్… pic.twitter.com/R9ATgOaND8
— Gulte (@GulteOfficial) December 10, 2024