Box Office | ఇప్పటి సినీ ప్రపంచంలో ఒక సినిమా తీస్తే చాలు కోట్లు కాదు, వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతోంది. ఒకప్పుడు తక్కువ ఖర్చుతో సినిమాలు తీసి రెట్టింపు లాభాలు సాధించిన రోజులు పోయాయి. ఇప్పుడు హై బడ్జెట్ సినిమాలు తీసినా హిట్ అవుతాయా లేదా అనే భయం నిర్మాతలను వెంటాడుతోంది. అయినప్పటికీ, పలు నిర్మాతలు భారీ పెట్టుబడులతో సినిమాలు తెరకెక్కించి రిస్క్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ పెట్టిన టాప్ సినిమాలు ఇవి
1. కల్కి 2898 AD – ₹600 కోట్లు
వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ పెట్టారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే ప్రధాన పాత్రల్లో నటించారు. నటుల రెమ్యూనరేషన్లకే సగం బడ్జెట్ వెళ్ళిందని సమాచారం.
2. ఆర్ఆర్ఆర్ – ₹550 కోట్లు
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో పేరు తెచ్చుకుంది, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది.
3. ఆది పురుష్ – ₹550 కోట్లు
ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ పౌరాణిక చిత్రం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కింది. అయితే భారీ బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించింది.
4. రోబో 2.0 – ₹550 కోట్లు
రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ సైఫై మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రోబోకి వచ్చిన స్థాయి సక్సెస్‌ను 2.0 సాధించలేకపోయింది.
5. పుష్ప 2 – ₹500 కోట్లు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2కి నిర్మాతలు దాదాపు 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ‘పుష్ప’ సక్సెస్ తర్వాత ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి, ఇప్పటికే రికార్డ్ బ్రేక్ చేసే కలెక్షన్లు సాధించింది.
6. ది గోట్ – ₹380 కోట్లు
తమిళ స్టార్ విజయ్ ద్విపాత్రాభినయంతో నటించిన ది గోట్ 380 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. మిక్స్డ్ టాక్ వచ్చినా నిర్మాతలకు పెద్దగా నష్టం రాలేదని సమాచారం.
7. బ్రహ్మాస్త్ర – ₹350 కోట్లు
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ నటించిన ఈ విజువల్ వండర్ సినిమాకు 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉండటంతో ఖర్చు భారీగా పెరిగింది. సీక్వెల్ కూడా త్వరలో రానుంది.
8. గేమ్ ఛేంజర్ – ₹350 కోట్లు
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ మూవీ 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదని టాక్.
9. కూలీ – ₹350 కోట్లు
రజనీకాంత్ హీరోగా, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా 500 కోట్ల వసూళ్లు దాటేసింది.
10. వార్ 2 – ₹350 కోట్లు
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న బాలీవుడ్ యాక్షన్ చిత్రం వార్ 2 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం బలహీనంగా ఉందని సమాచారం.
ఇక రాబోయే రెండు భారీ సినిమాలు బడ్జెట్ పరంగా కొత్త రికార్డులు సృష్టించనున్నాయి. బాలీవుడ్ ‘రామాయణ’ సినిమాకు ₹2000 కోట్ల బడ్జెట్, మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 సినిమాకు ₹1200 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్ వినిపిస్తోంది. భారీ పెట్టుబడులతో సినిమాలు తీయడం నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారిన ఈ కాలంలో, సక్సెస్ ఫార్ములా ఏది అనే ప్రశ్న మాత్రం ఇంకా జవాబు కోసం ఎదురుచూస్తోంది.