Hidimba | అశ్విన్‌బాబు (Ashwin Babu), నందితా శ్వేత (Nandita Swetha) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హిడింబ’ (Hidimba). అనిల్ కన్నెగంటి (Anil Krishna Kanneganti) దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. హిడింబ అశ్విన్‌బాబు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలువబోతుందని ఇప్పటివరకు వచ్చిన టాక్‌తో అర్థమవుతోంది.
హైదరాబాద్ సిటీలో పలువురు మహిళలు అదృశ్యమవుతారు. ఈ కేసును చేధించే స్పెషల్ ఆఫీసర్లుగా నందిత శ్వేత, అశ్విన్ బాబు నియామకం అవుతారు. క్రిమినల్ మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్లు ఆ మహిళల కిడ్నాప్ మిస్టరీని చేధించారా..? అనే నేపథ్యంలో సాగే కథ సినిమా.
రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే.. సూపర్ థ్రిల్లింగ్ క్లైమాక్స్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్ చేస్తారని అంటున్నారు ఈ సినిమా చూసిన మూవీ లవర్స్. ఈ చిత్రానికి వికాస్ బడిస బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చింపేశారని చెబుతున్నారు. చివరి 30 నిమిషాలు అయితే అదిరిపోయిందని, సినిమా చాలా బాగుందని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇస్తుందని చెబుతున్నారు మూవీ లవర్స్.
ఈ చిత్రాన్ని ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ (Gangapatnam Sridhar) తెరకెక్కించారు. రేపు విజయ్ ఆంటోనీ నటించిన హత్య సినిమా విడుదల కానుంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు మినహా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవి లేకపోవడంతో హిడింబ మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయనే దానిపై అప్డేట్ రావాల్సి ఉంది.
The BLOODY SCARY BLOCKBUSTER gets Unanimous Response at Theaters 🙌😍
Watch the Fiery #HIDIMBHA In Your Nearest Cinemas Today 💥
Book Ur Tickets Now!
🎟️https://t.co/51B6TQejpC@Nanditasweta @aneelkanneganti #GangapatnamSridhar #SVKCinemas @AKentsOfficial #OAK pic.twitter.com/sHbeUUcxKE— Ashwin Babu (@imashwinbabu) July 20, 2023