Mrunal Thakur | సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ‘విట్టి దండు’ అనే మరాఠి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే 2019లో వచ్చిన ‘సూపర్30’ మూవీ హిందీలో మృణాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరిస్ వంటి హిట్ సినిమాలు చేసింది. ఇక ఏడాది క్రితం ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. సీతామహాలక్ష్మీ క్యారెక్టర్లో ఆమెను తప్ప ఎవరినీ ఊహించుకోని రేంజ్లో నటించింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో నానితో చేస్తున్న హాయ్ నాన్న ఒకటి.
శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి మృణాళ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. గిటారు బ్యాక్ వేసుకుని ఉన్న మృణాళ్ పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమాలో మృణాళ్ గిటార్ నేర్పించే టీచర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైరా ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. మలయాళ హృదయంతో మ్యూజిక్ లవర్స్ హృదయాలు కొల్లగొట్టిన అబ్దుల్ హేషమ్ వాహబ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు.
Wishing a very Happy Birthday to the one and only @MissThakurani 🎉 Your charm and talent know no bounds. May you continue to rule our hearts forever! ❤️🔥 Team #HiNanna #NaturalStar🌟 @NameisNani @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri… pic.twitter.com/Zi5NmNTtGs
— Vyra Entertainments (@VyraEnts) August 1, 2023