Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakoor) ఈ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ నవంబర్ 04న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘ప్రాణం అల్లాడి పొద అమ్మాడి’ అంటూ సాగిన ఈ ప్రోమోలో నానిని, మృణాల్ టచ్ చేస్తున్న స్టిల్ చాలా అందంగా ఉంది. చూస్తుంటే ఈ జోడీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. ఇక నాని సినిమాలల్లో రొమాంటిక్ కుర్రాడి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాగా.. ఈ సినిమాలో మృణాల్ చాలా అందంగా హైలైట్ కాబోతోందని సాంగ్ స్పష్టం చేసింది.
Pinching your hearts on 4th 🙂#Ammadi will be magic ♥️#HiNannaOnDec7th pic.twitter.com/RrL1yTDwVT
— Nani (@NameisNani) November 1, 2023
ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అందమైన ప్రేమ జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో కాంబినేషన్ పరంగా కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇక ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మలయాళ కంపోజర్, హృదయం, ఖుషీ చిత్రాల ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్ కాగా.. జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు.