Patang | పతంగుల పోటీ నేపథ్యంలో రాబోతున్న స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రణీత్ పత్తిపాటి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘హే..హలో..నమస్తే హైదరాబాద్’ పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో వంశీ పూజిత్ మాట్లాడుతూ..
‘నేను పక్కా హైదరాబాదీని. ఈ సినిమాలో హైదరాబాద్ నేపథ్యంలో వచ్చే పాటకు స్టెప్పులేయడం కొత్త అనుభూతినిచ్చింది’ అన్నారు. ఈ పాటలో హైదరాబాద్ లైఫ్ ైస్టెల్‌ను, సెలబ్రేషన్స్‌ను చూపించారని ప్రణవ్ కౌశిక్ తెలిపారు. ఈ పాట వింటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయని నిర్మాతలు విజయ్‌శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి చెప్పారు. యువత కోరుకునే జోష్ ఈ పాటలో ఉందని సంగీత దర్శకుడు జోస్ జిమ్మి పేర్కొన్నారు.