అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హే చికితా’. ధన్‌రాజ్ లెక్కల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక ఆర్ ఎన్ యస్, ‘గరుడవేగ’ అంజి నిర్మాతలు. శనివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
టైటిల్‌ను దర్శకుడు అజయ్‌భూపతి లాంఛ్ చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతామని మేకర్స్ తెలిపారు. పృథ్వీరాజ్, దేవిప్రసాద్, ప్రభాకర్, వీరశంకర్, బలగం సుజాత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి, సంగీతం: చరణ్‌అర్జున్, రచన-దర్శకత్వం: ధన్‌రాజ్ లెక్కల.