Heroine | ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుంటే, మరి కొందరు పెద్దలు చూసిన వాడిని మనువాడుతున్నారు. అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ హల్దీ ఫోటోలు షేర్ చేయడంతో, ఇప్పుడు ఈ భామ కూడా పెళ్లి పీటలు ఎక్కుతుందా ఏంటా అనే ఆలోచనలో పడ్డారు. కొందరైతే ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. మేటర్లోకి వెళితే టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. తమ ట్యాలెంట్ ప్రపంచానికి పరిచయం చేసారు. అలా టిక్ టాక్ వీడియోల ద్వారా సత్తా చాటిన వారిలో దీపిక పిల్లి ఒకరు.
ఈ ముద్దుగుమ్మ మొదటిగా లిప్ సింక్ మరియు డబ్ స్మాష్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యింది. టిక్ టాక్‌లో ఆమెకి 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు, అంటే ఆమె ఎంత క్రేజ్ ఎలాంటిదో మనకి అర్థమవుతుంది. ఈ క్రేజ్‌తో టీవీకి పరిచయమై, ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ లో యాంకర్ మరియు మెంటార్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆమెకు మరింత క్రేజ్ రావడంతో జబర్దస్త్ వంటి షోల్లోనూ తన ప్రతిభను ప్రదర్శించింది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో ఆమె బిగ్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టింది. మొదటగా ‘వాంటెడ్ పండుగాడు’ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో మరోసారి అలరించింది.
ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ, అందం మరియు అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో హల్దీ ఫొటోస్ షేర్ చేసి ఫ్యాన్స్‌తో సంతోషం పంచుకుంది. ఆ ఫోటోలలో #haldi #pellisandadi #pellichoopulu #pellikuthuru #marriagediaries అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయిపోయాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ దీపికకి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందా, ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.