Heroine| టాలీవుడ్లో ఒక్క సినిమాతోనే సంచలనం రేపిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో షాలిని పాండే ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా హైలైట్ అయిన షాలిని పాండే ఆ తర్వాత మళ్లీ అలాంటి హిట్ అందుకోలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో అటు హీరో విజయ్ దేవరకొండ ఇటు షాలిని పాండే ఇద్దరు కూడా కావల్సినంత కంటెంట్ ఇచ్చారు. అప్పటికీ షాలిని పాండే తెలుగు ఆడియెన్స్ కి అంతగా పరిచయం లేదు. కాని అర్జున్ రెడ్డిలో ప్రీతి అనే పాత్రతో మాత్రం అందరిని ఆకట్టుకుంది.ఈ సినిమా తర్వాత షాలిని పాండే పలు సినిమాలలో నటించిన కూడా ఒక్క మూవీ కూడా పెద్ద విజయం సాధించలేకపోయింది.
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కూడా కరువయ్యాయి.హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.’డబ్బా కార్టెల్’ ప్రమోషన్స్ లో భాగంగా షాలినీ పాండే మాట్లాడుతూ..కెరీర్ ప్రారంభంలో నేను సౌత్ సినిమా చేశాను. ఆ సమయంలో డైరెక్టర్ ప్రవర్తన వలన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కారవాన్లో నేను డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో నా అనుమతి లేకుండానే అతడు డోర్ తీశాడు. నాకు కోపం వచ్చి వెంటనే ఆయనపై కేకలు వేయడం స్టార్ట్ చేశాను..అప్పుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.
అప్పుడు అలా కోప్పడకూడదని నా చుట్టు పక్కన వాళ్లు అన్నారు. కాని నాకు మాత్రం చేను చేసింది కరెక్టే అనిపించింది.ఆ సంఘటన తర్వాత మళ్లీ నాకు అలాంటి ఇన్సిడెంట్స్ ఎదురు కాలేదు. ఒకవేళ అలాంటి సిట్యువేషన్స్ వచ్చిన కూడా కోప్పడకుండా వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో నేను తెలుసుకున్నాను అని షాలిని పాండే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక షాలిని పాండే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో నివసించింది . అక్కడే ఇంజనీరింగ్ చదివింది. ఆ సమయంలో నటనపై ఆసక్తితో స్టేజ్ డ్రామాలు వేసింది. ఆ తర్వాత సినిమాలలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.