Heroin Nidhhi Agerwal ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సెంటర్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ ప్రారంభోత్సవంలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల అందంగా మరియు ఫిట్‌గా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. కలర్స్ 2.0 లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, అత్యాధునిక మెషిన్లు, నిపుణులైన డాక్టర్ల సేవలు ఎంతో బాగున్నాయని ఆమె ప్రశంసించారు. ఇలాంటి అద్భుతమైన వాతావరణంలో ఆరోగ్యం మరియు డైటింగ్ పై శ్రద్ధ పెట్టడం ద్వారా మరింత మోటివేషన్ లభిస్తుందని పేర్కొన్నారు. బరువు నిర్వహణతో పాటు చర్మం, జుట్టు సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో తగిన సేవలు అవసరమని, ఇలాంటి ప్రత్యేక కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.
కలర్స్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, ప్రజల మారుతున్న జీవనశైలి మరియు ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకునే కొంపల్లిలో ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్థానిక ప్రజలకు వారి అవసరాలకు తగినట్లుగా అత్యుత్తమ వెల్నెస్ సేవలను అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, కొంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రం తమ సంస్థకు 55వ శాఖ అని తెలిపారు. గత 23 సంవత్సరాలుగా కలర్స్ హెల్త్‌కేర్ వినియోగదారుల ఆదరాభిమానాలతో నిరంతరం సేవలు అందిస్తోందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో తమ శాఖలను వేగంగా విస్తరిస్తున్నామని, ఇందులో భాగంగానే కొంపల్లితో పాటు చారిత్రక ప్రాధాన్యం గల మదురైలోనూ ‘కలర్స్ 2.0’ శాఖను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణరాజ్ తుమ్మల మాట్లాడుతూ, కస్టమర్ల అభ్యర్థన మేరకే కొంపల్లిలో ఈ నూతన శాఖను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. గత రెండు దశాబ్దాలకు పైగా వెల్నెస్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నామని, కస్టమర్ల సంతృప్తే తమకు అత్యంత ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సమగ్ర డెర్మటాలజీ మరియు వెల్నెస్ సేవలను అందించే ప్రముఖ సంస్థగా కలర్స్ గుర్తింపు పొందిందని తెలిపారు.
కొంపల్లిలోని సుచిత్ర ఎక్స్ రోడ్స్‌లో, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న జూడియో భవనం మూడో అంతస్తులో ఈ నూతన శాఖను పూర్తి స్థాయి సదుపాయాలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచ స్థాయి బరువు తగ్గింపు కార్యక్రమాలతో పాటు స్కిన్ ఎస్తెటిక్స్, హెయిర్ కేర్ మరియు చర్మ సౌందర్యానికి సంబంధించిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉంటాయని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రీట్మెంట్ తీసుకున్న పలువురు కస్టమర్లు తమ అనుభవాలను పంచుకుంటూ, తాము బరువు తగ్గినట్లు ఆనందం వ్యక్తం చేశారు. 5ఎం మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జయదీప్ పర్యవేక్షించగా, పెద్ద సంఖ్యలో స్థానిక యువత, ప్రముఖులు, వైద్య నిపుణులు మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.