ఇది వారసుల సంక్రాంతి.. హీరో Vs సూపర్ మచ్చి Vs రౌడీ బాయ్స్..

Hero vs Super machi vs rowdy boys | ఈ సంక్రాంతి పండక్కి పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో.. చిన్న సినిమాలు వరుసగా క్యూ కట్టాయి. అందులో చెప్పుకోవాల్సిన సినిమాలు ముఖ్యంగా మూడు ఉన్నాయి. ఎలాగూ బంగార్రాజు సినిమాతో వస్తానని నాగార్జున ముందు నుంచి చెబుతున్నాడు. చెప్పినట్లుగానే భోగి రోజు జనవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పండక్కి ముఖ్యంగా ముగ్గురు వారసుల మధ్య బాక్సాఫీస్ పోరు జరగనుంది. ఈ ముగ్గురు కూడా పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే కావడం గమనార్హం.
ఘట్టమనేని కృష్ణ కుటుంబం నుంచి ఆయన మనవడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈయన కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా హీరో. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. జనవరి 15న విడుదల కానుంది ఈ సినిమా. మరోవైపు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి మొదటిసారి ఒక నటుడు వస్తున్నాడు. ఇప్పటివరకు ఎంతో మంది హీరోలకు తన నిర్మాణ సంస్థలో లైఫ్ ఇచ్చిన దిల్ రాజు.. మొదటిసారి తన వారసుడిని బాక్సాఫీస్ బరిలో దింపుతున్నాడు. ఈయన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న సినిమా రౌడీ బాయ్స్. ఇది జనవరి 14 న విడుదల అవుతుంది. హుషారు సినిమాను తెరకెక్కించిన శ్రీ హర్ష దీనికి దర్శకుడు. ఇక మెగా కుటుంబం నుంచి చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి జనవరి 14న విడుదలవుతోంది. ముఖ్యంగా ఈ ముగ్గురు వారసుల మధ్య బాక్సాఫీస్ దగ్గర వార్ ఆసక్తికరంగా జరగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bangarraju | బంగార్రాజు సినిమాలో 8 మంది హీరోయిన్లు.. ఎవరెవరంటే..
అల్లుడిని అలా వదిలేశారేం.. సూపర్ మచ్చి ని పట్టించుకోని మెగా హీరోలు
Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..
గ్లామర్ హీరోయిన్ అని పిలవడంపై నిధి అగర్వాల్ రియాక్షన్ ఇదీ..
ప్రేమ దేశం సినిమాకు రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధం ఉందా?.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
సంక్రాంతి విజేత | హీరో వర్సెస్ రౌడీ బాయ్స్ గెలుపెవరిది?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

