అల్లుడిని అలా వదిలేశారేం.. సూపర్ మచ్చి ని పట్టించుకోని మెగా హీరోలు

Super Machi | మెగా కుటుంబం నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడు అంటే అందరూ కలిసి వచ్చి ప్రమోట్ చేస్తారు. అతడి ప్రతి సినిమా ఈవెంట్ ఒక పండగలా జరుగుతుంది. అలాంటిది ఆ ఇంటి అల్లుడు నటించిన సినిమా గురించి మెగా హీరోలు ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతి బరిలో ఉంది. పెద్ద సినిమాలు వాయిదా పడటంతో జనవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. నిజానికి రెండేండ్ల కింద విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా గత సంవత్సర కాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుంది. మధ్యలో కరోనా వైరస్ కూడా అటాక్ చేయడంతో సూపర్ మచ్చి సినిమా గురించి అందరూ మర్చిపోయారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. పెద్దగా ప్రమోషన్ లేకుండానే సూపర్ మచ్చి సినిమా విడుదలకు సిద్ధమైంది.

సంక్రాంతి పండగ బరిలో ఉన్న మిగిలిన సినిమాలతో పోలిస్తే దీనిపై అంచనాలు కూడా తక్కువగానే ఉన్నాయి. పులి వాసు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్పై వస్తోంది. కన్నడ హీరోయిన్ రచిత రామ్ ఇందులో కళ్యాణ్ దేవ్ కు జోడీగా నటించింది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది అని తెలిసిన తర్వాత కూడా మెగా హీరోలు ఎవరూ కనీసం ప్రమోషన్ చేయక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బయటి హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లిన రామ్ చరణ్.. సొంత బావ సినిమాను మాత్రం పక్కన పెట్టేశాడు. మరోవైపు అల్లుడు సినిమాను చిరంజీవి కూడా పట్టించుకోవడం లేదు. సూపర్ మచ్చి సినిమా గురించి కనీసం ఒక ట్వీట్ కూడా లేదు. దాంతో అభిమానులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ఇదే పండక్కి విడుదలవుతున్న రౌడీ బాయ్స్, హీరో సినిమాలకు మెగా హీరోలు ప్రమోషన్ చేశారు. కానీ కళ్యాణ్ దేవ్ సినిమా మాత్రం సోలోగా వస్తుంది. దీని వెనక మర్మం ఎవరికీ అర్థం కావడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sankranti | సంక్రాంతికి సినిమా రాకపోయినా రాధే శ్యామ్ పతంగి వచ్చింది..
ఏపీ సీఎం జగన్తో చిరంజీవి మీటింగ్.. భేటీలో ఏం నిర్ణయం తీసుకున్నారంటే..
RRR విడుదలపై స్పందించిన హీరో రామ్చరణ్
ఇన్స్టాగ్రామ్లో సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

