ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..

Icon star Allu Arjun | సోషల్‌మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ఈయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అంటే కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం గమనార్హం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నర ఏళ్లలోనే ఈయన ఈ ఘనత అందుకోవడం విశేషం.

2017 నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు అల్లు అర్జున్. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తూ వచ్చారు ఐకాన్ స్టార్. మెల్లమెల్లగా ఫాలోయర్స్‌ను పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 15 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయిని అందుకున్నారు అల్లు అర్జున్. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యారు. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా అల్లు అర్జున్ను సౌత్ కా సుల్తాన్ అని పిలుస్తున్నారు.
సోషల్ మీడియాలో తనకు తానే సాటి అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. తనకు 15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్స్‌కు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. అలాగే ఫేస్బుక్లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగారు. పుష్ప: దఇ రైజ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దేశాలు దాటిన పుష్ప క్రేజ్..సామీ సామీ సాంగ్‌కు టాంజానియా వ్యక్తి అదిరిపోయే స్టెప్పులు
Chandrababu in Pushpa | పుష్ప సినిమాలో చంద్రబాబు.. ఏ సీన్లో కనిపిస్తాడో తెలుసా?
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

