త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ , అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకుడు. అరవింద్ మాండ్యం నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ‘మనం నిజజీవితంలో చూసే పాత్రలు, సంఘటనలతో కూడిన ప్రేమకథ ఇది.
ఈ ప్రేమకథలోని సంఘర్షణ అందరికీ కనెక్టయ్యేలా ఉంటుంది. అందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది’ అని దర్శకుడు మధుదీప్ నమ్మకం వ్యక్తంచేశారు. ఇంకా నిర్మాత అరవింద్, హీరోహీరోయిన్లు త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, పంపిణీదారుడు ముత్యాల రాందాస్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్.వి, సంగీతం: ప్రకాశ్ చెరుకూరి, అరుణ్ చిలువేరు, సమర్పణ: సీహెచ్వీఎస్ఎన్ బాబ్జీ, నిర్మాణం: లోటస్ క్రియేటివ్ వర్క్స్.