Kanguva Movie | తమిళ అగ్ర హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’ నిర్మాణం నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. శివ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మరింత అంచనాల్ని పెంచాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ట్రైలర్‌ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా శనివారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్ మూవీగా పదిభాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో సూర్య అపజయం ఎరుగని యుద్ధవీరుడిగా కనిపిస్తారని, ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రానటువంటి వైవిధ్యమైన కాన్సెప్ట్, మేకింగ్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం త్రీడీలో కూడా విడుదలకానుంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిస్వామి, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, దర్శకత్వం: శివ.