రవి జంగు, ప్రీతి కొంగన జంటగా నటిస్తున్న చిత్రం ‘వరదరాజు గోవిందం’. సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి.సాయి అరుణ్‌కుమార్ నిర్మించారు. ఆరు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు సుమన్, శుభలేఖ సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కృష్ణుడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించామని, భారతదేశం గర్వించేలా ఉంటుందని దర్శకనిర్మాత వి.సముద్ర తెలిపారు. హిందీ, హర్యాన, అస్సాం భాషల్లో సినిమాలు చేశానని, తెలుగులో తనకిది తొలిచిత్రమని, తప్పకుండా బ్రేక్‌నిస్తుందనే నమ్మకం ఉందని హీరో రవి జంగు ఆశాభావం వ్యక్తం చేశారు. అతిథులందరూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.