శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్ జంటగా నటించిన చిత్రం ‘నిశ్శబ్ద ప్రేమ’. రాజ్దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కార్తికేయన్ నిర్మించారు. నేడు రిలీజ్ కానుంది. బుధవారం ట్రైలర్‌తో పాటు పాటల్ని విడుదల చేశారు. తమిళంలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించిందని, తెలుగులో కూడా అదే రీతిలో మెప్పిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు రాజ్దేవ్ తెలిపారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ప్రేమకథా చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. తప్పకుండా ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.