శ్రీరామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోడి బుర్ర’. ‘అల్లుకున్న కథ’ ఉపశీర్షిక. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతిమీనన్, ఆరుషి కథానాయికలు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో భారీ ైక్లెమాక్స్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ైక్లెమాక్స్ సీక్వెన్స్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. రియలిస్టిక్ కథాంశమిదని, యాక్షన్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుందని హీరో శ్రీరామ్ తెలిపారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్ రాగ, నిర్మాతలు: కంచర్ల సత్యనారాయణ రెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేష్ గౌడ్, రచన-దర్శకత్వం: చంద్రశేఖర్ కానూరి.