గత ఏడాది ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమా ఒకటి. శ్రీవిష్ణు నటిస్తున్న 18వ చిత్రమిది. ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘సింగిల్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.