HERO| ఈ మధ్య కాలంలో అభిమానులు సెలబ్రిటీల పుట్టు పూర్వత్తరాలు అన్ని తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. పుట్టిన ఊరు దగ్గర నుండి ఏం చదివారు, ఎక్కడ ఉండేవారు ఇలాంటి విషయాల గురించి ఆరాలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ బుడ్డోడి ఫొటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇతను పుట్టి పెరిగింది హైదరాబాద్ కాగా, అతను చదువుకుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో, ఆ తర్వాత సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాడు. ఇక నటనపై ఆసక్తి పెంచుకున్న అతను ముంబైలోని కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకరిగా మారాడు.
ఇతను మొదట సపోర్టింగ్ ఆర్టిస్టుగా పని చేసి ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ విజయాలు అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి టాలీవుడ్ లో మినిమిం గ్యారంటీ అనిపించుకున్న ఈ హీరో ఇటీవలి కాలంలో పెద్దగా సక్సెస్లు అందుకోలేకపోతున్నాడు. పెళ్లి కూడా చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. ఇక మనోడికి రామ్ చరణ్, రానా ఇద్దరు మంచి స్నేహితులు. ముగ్గురూ కలిసి బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. ఇంత చెప్పాక మీకు ఇతను ఎవరోఅర్ధమయ్యే ఉంటుంది.
ఇతను మరెవరో కాదు ఛార్మింగ్ స్టార్ శర్వానంద్. మార్చి 6న అతని పుట్టిన రోజు కాగా, దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు , నెటిజన్లు శర్వాకు భారీ ఎత్తున బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇక శర్వానంద్ చివరిగా మనమే సినిమాలో కనిపించగా, ఈ సినిమా అంత హిట్ కాలేదు. 2024 జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మార్చి8 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక శర్వా ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్నాడు. శర్వానంద్ 36వ చిత్రాన్ని అతని హోమ్ ప్రొడక్షన్ లాంటి యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వానంద్ చేస్తున్న 37వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ .. ‘సామజవర గమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుంది.ఇక శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తుండగా, ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.