Nivetha Thomas | హీరో రానా సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం ‘35-చిన్న కథ కాదు’. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నందకిషోర్ ఈమాని దర్శకుడు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘నీలి మేఘాలలో..’ అనే పాటను విడుదల చేశారు.
ప్రేమికుల మనోభావాలకు అద్దం పడుతూ సాగిన ఈ పాటకు వివేక్‌సాగర్ స్వరాల్ని అందించగా భరద్వాజ్ రచించారు. పృథ్వీ హరీష్ ఆలపించారు. మధ్య తరగతి జీవితాలను ఆవిష్కరించే కథ ఇదని, పాఠశాల తాలూకు ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు.