బ్రేకప్ అయినవాళ్లు కలుసుకుంటారు
18 పేజెస్' ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. బ్రేకప్ అయినవాళ్లు కూడా మళ్లీ కలుసుకునేలా ప్రేరణనిస్తుంది అని అన్నారు నిఖిల్ సిద్ధార్థ.
‘18 పేజెస్’ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. బ్రేకప్ అయినవాళ్లు కూడా మళ్లీ కలుసుకునేలా ప్రేరణనిస్తుంది’ అని అన్నారు నిఖిల్ సిద్ధార్థ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ సిద్ధార్థ గురువారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
‘కార్తికేయ-2’ వంటి అడ్వెంచరస్ మూవీ తర్వాత భావోద్వేగభరితమైన ప్రేమకథ ‘18 పేజిస్’లో నటించడం ఆనందంగా ఉంది. స్వతహాగా నాకు క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం. నేను తొలిసారి నటించిన ఎమోషనల్ ఫిల్మ్ ‘18 పేజిస్’. సుకుమార్‌గారు రాసిన కథ కాబట్టి ప్రతీ సీన్ హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఇందులో చక్కటి లవ్‌స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమ తాలూకు భిన్న అంశాల్ని స్పృశిస్తూ సాగుతుంది. బ్రేకప్ అయిన వారు తిరిగి ఎలా కలుసుకున్నారనేది ఉద్వేగాన్ని పంచుతుంది.
ఫ్రెష్ ఫీల్‌తో బయటకొస్తారు
ఈ సినిమాలో నేను సిద్ధు అనే యువకుడి పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటుంది. సుకుమార్‌గారి రచనలో ప్రేమకథ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన శైలి ఎమోషన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడే స్తాయి. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి. గోపీసుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు థియేటర్ల నుంచి ఫ్రెష్ ఫీల్‌తో బయటకొస్తారు. నందిని పాత్రలో అనుపమ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.
అన్ని భాషలకు కనెక్ట్ కావాలి
‘కార్తికేయ-2’ తర్వాత కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా. ఇకముందు ఎంచుకునే ప్రతి కథకు జాతీయస్థాయిలో రీచ్ ఉండేలా చూసుకుంటా. నా భవిష్యత్తు సినిమాలన్నీ అదే తరహాలో ఉంటాయి. నా తదుపరి చిత్రం ‘స్పై’ షూటింగ్ పూర్తయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

