కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. ‘డీజే టిల్లు’ఫేమ్ నేహాశెట్టి కథానాయిక. క్లాక్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, మోషన్‌పోస్టర్‌ను హీరో నాని బుధవారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్.
సినిమా చూసిన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని, థ్రిల్ల్‌ను పంచే చిత్రమవుతుందని న్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సమర్పణ: సి.యువరాజ్.