విశాల్ ఎనిమి 2 డేస్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది.. ఇంకా ఎంత రావాలి..?

vishal Enemy movie collections | విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు మంచి వసూళ్లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే తన ప్రతీ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తాడు విశాల్. ఇప్పుడు ఈయన నటించిన ఎనిమి ప్రేక్షకుల ముందుకొచ్చింది. దివాళీ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఆర్య ఇందులో విలన్‌గా నటించాడు. ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా పెద్దగా అంచనాలు అయితే లేవు. దానికితోడు రజినీకాంత్ పెద్దన్న.. మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమాలకు పోటీగా రావడంతో కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో అనుకున్నారంతా. కానీ ఆ రెండు సినిమాల కంటే మంచి వసూళ్లనే విశాల్ సినిమా దక్కించుకుంది. కాకపోతే బ్రేక్ ఈవెన్ కావడానికి మాత్రం అద్భుతాలు జరగాల్సిందే.
నైజాం: 0.50 కోట్లు
సీడెడ్: 0.25 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.16 కోట్లు
గుంటూరు: 0.15 కోట్లు
ఈస్ట్: 0.12 కోట్లు
వెస్ట్: 0.09 కోట్లు
కృష్ణా: 0.08 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణ: 1.42 కోట్లు షేర్
ఎనిమి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లకు అమ్మారు. మూడేళ్ల కింద విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు సినిమా రూ.9 కోట్లు వసూలు చేసింది. అంటే విశాల్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉందన్నమాట. ఆ నమ్మకంతోనే ఎనిమి సినిమాను రూ.4 కోట్లకు కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా అన్ని కోట్లు వసూలు చేస్తుందా అనేది అనుమానమే. ఎనిమి సేఫ్ అవ్వాలంటే మరో 2.5 కోట్లకు పైగానే వసూలు చేయాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
లవ్ స్టోరీ ఫైనల్ కలెక్షన్స్.. క్లిష్ట పరిస్థితుల్లో హిట్ కొట్టిన చైతూ..
బాలకృష్ణతో కన్నడ హీరో ఢీ.. గోపీచంద్ స్కెచ్ మామూలుగా లేదుగా..
మంచి రోజులు వచ్చాయి 2 డేస్ కలెక్షన్స్.. మారుతి రేంజ్‌కు ఇది సరిపోలే..
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Bheemla Nayak : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పవన్.. ఫిబ్రవరిలో సందడి చేసేందుకు సిద్ధం
Fun bucket bhargav : బెయిల్‌పై విడుదలైన ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ జైలుకే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- arya
- ENEMY
- telugu cinema
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

