కొండ పొలం ఫైనల్ కలెక్షన్స్ వచ్చేశాయి.. మెగా మేనల్లుడికి డిజాస్టర్ తప్పలేదు

konda polam movie final collections | తొలి సినిమాతోనే ఉప్పెనలా దూసుకొచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. కృతి శెట్టి కథానాయికగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా కరోనా సెకండ్ వేవ్‌కు ముందు భారీ విజయాన్ని సాధించింది. డెబ్యూ సినిమాతోనే రికార్డు కలెక్షన్లతో మ్యాజిక్ చేశాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. రకుల్ కథానాయికగా వచ్చిన కొండపొలం సినిమా భారీ అంచనాలతో అక్టోబర్ 8న విడుదలైంది. కానీ ఈ సినిమాకు తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ కొండ పొలం సినిమా ఉప్పెన లా సునామీ సృష్టించలేక టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో కొండ పొలం సినిమా ఫైనల్ కలెక్షన్స్ వచ్చేశాయి. మరి మెగా మేనల్లుడు సినిమా ఎంత కలెక్షన్ సాధించిందో ఒకసారి చూద్దాం..
ఏరియాల వారీగా కొండ పొలం సినిమా ఫైనల్ కలెక్షన్స్
నైజాం- 98 లక్షలు
సీడెడ్- 44 లక్షలు
ఉత్తరాంధ్ర- 65 లక్షలు
ఈస్ట్- 36 లక్షలు
వెస్ట్- 27 లక్షలు
గుంటూరు- 39 లక్షలు
కృష్ణా- 30 లక్షలు
నెల్లూరు- 20 లక్షలు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 3.59 కోట్లు ( 1.95 కోట్లు గ్రాస్ )
రెస్ట్ ఆఫ్ ఇండియా- 31 లక్షలు
ఓవర్సీస్- 7 లక్షలు
వరల్డ్ వైడ్ (టోటల్)- 3.90 కోట్లు
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కొండ పొలం సినిమా 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.8 కోట్లు వసూలు చేయాలి. కానీ మూడు వారాలు ముగిసేసరికి కేవలం రూ.3.90 కోట్లు మాత్రమే కలెక్షన్ చేసింది. బయ్యర్లకు 4 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. టాలీవుడ్లో డిజాస్టర్‌గా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Maa elections | ఒక్క ఓటమితోనే మెగా ఫ్యామిలీ సత్తా తగ్గిపోతుందా..?
Rakul: కొండపొలం కోసం రకుల్ నేర్చుకున్న ప్రత్యేక భాష ఏంటో తెలుసా?
రకుల్ ప్రీత్ సింగ్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్న అల్లు అర్జున్
రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ
Rakul: రకుల్ పెళ్లి జరగదట.. జైలుకి వెళ్లడం ఖాయమట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

