Thalaivar 170 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇప్పటికే జైలర్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడని తెలిసిందే. జైలర్ ఓ వైపు రికార్డులు బద్దలు కొడుతుండగా.. మరోవైపు తలైవా 170 (Thalaivar 170) క్రేజీ అప్డేట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుండగా.. తాజాగా ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ను ఫైనల్ చేశారు మేకర్స్.
అంతేకాదు తలైవా 170 షూటింగ్ సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానుంది. తాజా వార్తతో సిల్వర్ స్క్రీన్‌పై రజినీకాంత్, ఫహద్ ఫాసిల్ కాంబినేషన్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, న్యాచురల్ స్టార్ నాని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 తాజా టాక్ ప్రకారం 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. రజినీకాంత్ మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj)తో తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Rajini Vs FaFa 🔥👏
As per the latest updates from Tamil media (© @SenthilraajaR) #FahadhFaasil confirmed as the antogonist for #TJGnanavel Directorial / #Thalaivar170 👏👏
Start rolling from Sep 19th…
SUPERSTAR RAJINIKANTH’S NEXT… pic.twitter.com/fbs9ivMQTv
— AB George (@AbGeorge_) August 22, 2023