Leo | స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం లియో (Leo.. Bloody Sweet). స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో మెరువనున్నాడని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ క్రేజీ వార్త అఫీషియల్ కానప్పటికీ రాంచరణ్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ తెరపైకి వచ్చింది.
లియోలో మెగా హీరో రాంచరణ్ కోసం ఎలాంటి పాత్ర లేదని, సినిమా కోసం ఆయన్ను సంప్రదించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని లోకేశ్ కనగరాజ్ సన్నిహిత వర్గాల సమాచారం. ఇటీవలే రాంచరణ్ తండ్రిగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసిందే. రాంచరణ్ ఆ మధురమైన క్షణాలను ఎంజాయ్ చేస్తూనే.. శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న గేమ్ ఛేంజర్ పనులపై ఫోకస్ పెడుతున్నాడని ఇన్సైడ్ టాక్.
లియోలో స్టార్ డైరెక్టర్లు గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్తోపాటు మరో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడని ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరోవైపు దళపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడిన ఫస్ట్ సాంగ్ నా రెడీ సాంగ్ (Naa Ready Song) నెట్టింట మంచి వ్యూస్ రాబడుతోంది.
లియోలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. లియో చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..