Shankar | స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar), కమల్‌హాసన్ (Kamal Haasan) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇండియన్ 2 షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే శంకర్ మరోవైపు ఇండియన్ 3ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది. శంకర్‌కు మూడో ఇన్స్టాల్మెంట్ తెరకెక్కించాలన్న ఆసక్తి ఏం లేదని తాజా కథనాల సారాంశం. ఇండియన్ 2 చిత్రంలో బాబీ సింహా, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఎస్జే సూర్య (SJ Suriyah) విలన్‌గా నటిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. శంకర్ టీం ఇప్పటికే విడుదల చేసిన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. శంకర్ మరోవైపు రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆర్సీ 15గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
ఇండియన్ 2కు శంకర్ సరికొత్త ప్రయోగం..
A new technology incoming to Kollywood via #Indian2😎🔥
Director Shankar at Lola VFX, Los Angeles to implement De-aging technology 🤩
Ulaganayagan #KamalHaasan always brings out something unique👏 pic.twitter.com/y1ESG31cac
— AmuthaBharathi (@CinemaWithAB) July 23, 2023
#Indian2 All language Digital rights said to be acquired by Netflix for 220 Crs🤯🔥#KH233(HVinoth movie) has also bought by Netflix for 125Crs💥
Ulaganayagan #KamalHaasan setting New Records in Indian cinema 🤝 pic.twitter.com/VYdMdDkzq7— AmuthaBharathi (@CinemaWithAB) July 23, 2023