Keerthy Suresh | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు కీర్తిసురేశ్ (Keerthy Suresh). మహానటి సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతమైన యాక్టింగ్‌తో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది న్యాచురల్ స్టార్ నానితో కలిసి దసరా సినిమాలో మెరిసింది. వెన్నెల పాత్రలో జీవించేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే కీర్తిసురేశ్ టైం దొరికితే స్నేహితులతో సరదా సమయాన్ని ఆస్వాదించేలా ప్లాన్ చేసుకుంటుందని తెలిసిందే. అయితే కీర్తిసురేశ్ ఓ హ్యాండ్స్ సమ్ బాయ్‌తో ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. కీర్తిసురేశ్‌తోపాటు ఆ వ్యక్తి కూడా ఒకే కలర్ షర్ట్ వేసుకోవడం స్టిల్ లో చూడొచ్చు.ఇంతకీ అతడి పేరేంటో తెలుసా..? ఫర్హాన్ బిన్ లియాఖత్ (Farhan Bin Liaquath). ఇటీవలే బర్త్ డే జరుపుకున్నాడు.
ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే ఫర్హానీ.. అని కీర్తిసురేశ్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ధన్యవాదాలు కిట్టీ (కీర్తిసురేశ్) అని రిప్లై ఇచ్చాడు ఫర్హాని. దీంతో కీర్తిసురేశ్ పక్కనుంది ఆమె బాయ్‌ఫ్రెండ్ అంటూ పుకార్లు నెట్టింట దర్శనమిచ్చాయి. అయితే అలాంటిదేమి లేదని, ఫర్హానీ- కీర్తిసురేశ్ మంచి స్నేహితులని మరో వార్త తెరపైకి వచ్చింది.
టాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు కీర్తిసురేశ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో చిరు సోదరి పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటిపై క్లారిటీ ఇవ్వనుంది కీర్తిసురేశ్.