Kalki 2898 AD | మరో 8 రోజుల్లో కల్కి సందడి షురూ కానుంది. టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా 8 రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ శరవేగంగా చేస్తుంది కల్కి టీమ్. ఇందులో భాగంగానే తాజాగా సీనియర్ నటి శోభన నటి పోస్టర్‌ను పంచుకుంది టీమ్. ఇక ఈ పోస్టర్ కింద ఆమె పూర్వీకులు కూడా ఆమె లాగే వేచి ఉన్నారు అంటూ రాసుకోచ్చింది. ఇక ఈ మూవీలో మరియం అనే పాత్రలో శోభన నటించబోతుంది. దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Her ancestors waited too, just like her…
8 days to go for #Kalki2898AD#Prabhas #Kalki2898ADonJune27 pic.twitter.com/PovyJHtnYt
— Vamsi Kaka (@vamsikaka) June 19, 2024